లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు చీఫ్ ఇంజనీర్ల బృందం రానుంది

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు చీఫ్ ఇంజనీర్ల బృందం రానుంది

 

కొందుర్గు: ఉమ్మడి మండల ప్రజల చిరకాల స్వప్నం అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ రూపకల్పనకు కీలకమైన అడుగు పడనుంది. షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల బృందం ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు వస్తోంది.

గురువారం ఉదయం 10 గంటలకు లాల్ పాహాడ్ చౌరస్తా వద్ద ఈ బృందం చేరుకోనుంది. ఈ సందర్శనతో ప్రజల ఆశల ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్లవుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రతినిధులు, మహిళా నాయకులు, సంఘాల సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన నాయకులు అందరూ బృందాన్ని స్వాగతించడానికి హాజరుకావాలని కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, షాద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

"ఈ మహోన్నత జల యజ్ఞానికి శ్రీకారం చుట్టే వేళ ప్రతి ఒక్కరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సహకరించాలి" అని కృష్ణారెడ్డి పేర్కొన్నా రు

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి