లింగంపల్లి డ్రైనేజ్ కాలువలో పడి మహిళ మృతి
By Ram Reddy
On
శేరిలింగంపల్లి ప్రతినిధి (లోకల్ గైడ్); లింగంపల్లి పాత గ్రామానికి చెందిన మహిళ డ్రైనేజ్ కాలువలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు తుర్పటి యాదమ్మ (45) జీహెచ్‌ఎంసీ కార్మికురాలు, ఆగస్టు 20వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో నాగులమ్మ గుడి సమీపంలో కూరగాయల మార్కెట్ వెనుక ఉన్న డ్రైనేజ్ కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు మద్యపానం అలవాటు కలిగి ఉండేదని, సహజవిసర్జన కోసం వెళ్లిన సమయంలో మత్తులో జారి కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు తుర్పటి కుమార్ (26) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి మృతికి ఎవరిపైనా అనుమానం లేదని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
About The Author

Latest News
26 Aug 2025 12:01:37
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా...