భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి

భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా (లోకల్ గైడ్);  సోమవారం సాయంత్రం హైదరాబాద్  నుండి భారీ వర్షాలు, వరద సహాయం పైన సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా . వీడియో కాన్ఫరెన్స్ లు హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీతక్క,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణా రావు,వివేక్ వెంకటస్వామి,అడ్లూరి లక్ష్మణ్,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి..
 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు.వివిధ విభాగాల ఉన్నతాధికారులు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీ లు.
నాగర్ కర్నూల్ జిల్లా వీడియో కాన్ఫరెన్స్ మందిరం నుండి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా  ఎస్పీ , సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ........
గత ఏడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం పైన ఆరా తీసిన సీఎం..
తక్షణమే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించించిన ముఖ్యమంత్రి..
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి..
రాష్ట్రం లో చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలి.
ఇప్పటి వరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదిక సమర్పించాలి .
వర్షాలు,వరదల కారణం గా జరిగిన పంట నష్టంఅంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలి..
గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎస్డి ఆర్ ఎఫ్ వరదల సమయంలో బాగా పనిచేసింది..
ఎన్డీ ఆర్ ఎఫ్ తో పని లేకుండా ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలి.
రాష్ట్రం లో వర్షాల కారణంగా 1052 చోట్ల  1023 కిలోమీటర్ల మేర కు రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం దృష్టి కి తెచ్చిన అధికారులు..
రోడ్ల డ్యామేజ్ పైన సమగ్ర నివేదిక తయారు చేయాలి..
7cafa294-9f68-48c8-9e31-991f0e19c3afహెచ్ఎం డీ ఏ పరిధిలో చెరువుల నోటిపై వెంటనే జరగాలి.. అని తెలిపారు. .......
సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ..........  రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేసిన సూచనలు సలహాలను పాటిస్తూ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన అంశాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. 
 రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలను జిల్లా స్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.   సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజలకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మందులు సరఫరా వైద్య సేవల విషయంలో తగు జాగ్రత్తలు చేపట్టాలని ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను  ఆదేశించారు. జిల్లాలోని చెరువులు సాగునీటి కుంటలు ప్రమాదకర స్థాయిలో ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 
అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేసేలా అధికారులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వర్షం కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
జిల్లా లో  కురవనున్న వర్షాల నేపథ్యంలో  వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్
ఈ సమావేశంలో అధికారులకు సూచించారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి