అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా

వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ 

అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా

హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్); వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ లో టీపీసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ  ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది అన్నారు. 
ఈ సందర్బంగా బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎర్రబెల్లి స్వర్ణ  మాట్లాడుతూ...ఎన్నో దశాబ్దాలుగా బి.సి.లు ఎదురుచూస్తున్న కల ఈరోజు నిజమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు బి.సి.లకు రాజకీయ, సామాజికంగా కొత్త దారులు చూపించనున్నాయి అన్నారు. ఇది తెలంగాణ చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచే ఘట్టం, సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ ధర్మం. కాంగ్రెస్ మాత్రమే సమానత్వం సాధ్యమని ఈరోజు నిరూపితమైంది” అని స్పష్టం చేశారు.2a1d9817-2f8e-4b38-b14a-5c466a35b6ae
అలాగే, బిల్లును ఆమోదింపజేసి బి.సి.లకు గౌరవం కల్పించినందుకు ఏఐసీసీ అధ్యక్షులు  మల్లికార్జున్ ఖర్గే కి, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ కి, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి, పీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ కు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీష శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు తత్తరీ లక్ష్మణ్,దామెర సర్వేషం, బిల్ల శ్రీకాంత్, జన్ను రవి, దుపం సంపత్, జన్ను అరుణ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కురివి పరమేష్, యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షులు ఎండీ సలీం, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కుసుమ వరుణ్, సీనియర్ నాయకులు గోరంటల రాజు, కరాటే ప్రభాకర్, కూరతోవ సదానందం,గజ్జెల లింగమూర్తి, జంజిరాల వేణు,రాముల బాబు, భైరబోయిన చంద్రమౌళి, అరెల్లి రవి, శ్రీనివాస్, తిరుపతి, గుండేటి సతీష్, పెండ్యాల కొమురయ్య, తోట బాలరాజు, వెల్డండి లక్ష్మణ్, ఎండీ మస్తాన్, సదానందం, ఇమ్రాన్, గినారపు రాజు, ఉమేందర్, మోహన్ రాంసింగ్, రాచర్ల శ్రీనివాస్, జన్ను శ్యామ్, నరిగే శ్రీనివాస్, చిరంజీవి, మహిళ నాయకులు కొయ్యడ ఉమా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి