వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు
-అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే..గూడెం మహిపాల్ రెడ్డి
పఠాన్ చేరు (లోకల్ గైడ్ ప్రతినిధి); వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పఠాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని తెలుసుకుంటూ. ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించు కోవాలని పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువుల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 390 చెరువులు ఉండగా 80 చెరువులు అలుగులు పారుతున్నాయని తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని వర్షాలు కురియనున్న నేపథ్యంలో చెరువు కట్టల పటిష్టతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. అకస్మాత్తుగా చెరువు కట్టలు తెగిపోయే పరిస్థితులు ఏర్పడితే వెంటనే మూసివేసేలా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. రెవెన్యూ, పంచాయతి రాజ్, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. అతి త్వరలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించను న్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డి లఈ రామస్వామి. ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
