సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు

సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు

 భూపాలపల్లి ప్రతినిధి (లోకల్ గైడ్); భారీ వర్షాలు వరద సహాయంపై సోమవారం డా బిఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జూపల్లి కృష్ణా రావు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు వివిధ విభాగాల ఉన్నతాధికారులు.పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం పైన ఆరా తీశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రం లో చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.ఇప్పటి వరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. వర్షాలు వరదల కారణం గా జరిగిన పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎస్డి ఆర్ ఎఫ్ వరదల సమయంలో బాగా పనిచేసిందని అభినందించారు.ఎన్డీ ఆర్ ఎఫ్ తో పని లేకుండా ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. రాష్ట్రం లో వర్షాల కారణంగా 1052 చోట్ల 1023 కిలోమీటర్ల మేర కు రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం తెలిపారు. రోడ్ల డ్యామేజ్ పైన సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు.
హెచ్ఎం డీ ఏ పరిధిలో చెరువుల నోటిపై వెంటనే జరగాలని సూచించారు.
టిజి ఎం ఎస్ ఐ డిసి చేపట్టిన 10 సంవత్సరాలు పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ద్వారా విచారణ చేపించి నివేదికలు అందచేయాలని తెలిపారు గత సంవత్సరం పకృతి విపత్తుల శాఖ ద్వారా వచ్చిన నిధులు ఖర్చులు రావాల్సిన నిధులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణ చర్యలకు కలెక్టర్లు వద్ద ఉన్న నిధులు వినియోగించాలన్నారు. రానున్న కొన్ని రోజులు వర్షాలు వచ్చే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.వరదలలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. చనిపోయిన జంతువుల కు కూడా పరిహారం ఇవ్వాలన్నారు.కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని కింద స్థాయి అధికారులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
306300ee-e6cd-4d39-8a9a-b456f8f24a65కలెక్టర్లు ఎస్పీ లు జిల్లాలోనే ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.మరి కొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మరికొన్ని రోజులు జిల్లాకు వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై అధికారులు సమగ్ర నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నివేదికలు అందజేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి వ్యవసాయ ఉద్యాన వైద్య ఆర్ అండ్ బి గృహ నిర్మాణ ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి