ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు...
వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు..
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ లకు పాల్పడుతు వికృత చేష్టలకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై సోమవారం బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు విద్యాసంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడటం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందని,ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తెలిపారు.ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తు విద్యాసంస్థల నుండి తొలగించడంతో పాటు ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల విద్యా,ఉద్యోగ,భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సూచించారు.విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,ప్రతి విద్యా సంస్థలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు,స్వ్కాడ్‌లను ఏర్పాటు చేయాలని,నూతనంగా వచ్చిన విద్యార్థుల కొసం ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని,ముఖ్యంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలతో పాటు సెమినార్లు,వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలని పేర్కొన్నారు.విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు గాను 24గంటల హైల్ప్‌లైన్ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో ఉంచాలని,విద్యార్థులు సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు,దౌర్జన్యాలు,అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే తక్షణమే ప్రిన్సిపల్,యాజమాన్యం,పోలీసులకు సమచారం అందించాలని,ర్యాగింగ్‌కు పాల్పడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు.విద్యాసంస్థల యాజమాన్యం,అధ్యాపకులు,విద్యార్థులు,పోలీసులు కలిసి పనిచేసినప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థిని విద్యార్థినీలు ఎవరైనా అవహేళన చేసినా,అవమానంగా మాట్లాడిన ర్యాగింగ్ చేసినా వెంటనే డయల్ 100,హెడ్ కానిస్టేబుల్ స్వప్న సెల్ నెంబర్ 8712580662,షీ టీం మంచిర్యాల ఎస్ఐ హైమ సెల్ నెంబర్ 8712581092,వన్ టౌన్ సిఐ 8712656559 లకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్,ఇంచార్జి ప్రిన్సిపల్ బి వెంకటేశ్వర్లు,పి రాజమల్లు,ఎల్ శివకృష్ణ,పి ఉమేష్ కుమార్,గౌతం,పాణి కిరణ్,షోయబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
About The Author
