కులమతాలతో సంబంధం లేకుండా మానవత్వంతో పేదల సమస్యలపై పోరాటం చేసే ఏకైక సంఘం. ఎమ్మార్పీఎస్.
దివ్యాంగుల పట్ల అశ్రద్ధ వహిస్తున్న అధికారపక్షాలు నోరు విప్పని ప్రతిపక్షాలు.
By Ram Reddy
On
నిర్మల్ (లోకల్ గైడ్); ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్‌దారులను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. శుక్రవారం భైంసా పట్టణం సురలోక గార్డెన్ లో ఏర్పాటు చేసిన మహా గర్జన సన్నాహక సదస్సు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు. పింఛన్‌దారులకు నెలకు రూ. వెయ్యి కోట్ల చొప్పున అందాల్సి ఉంటే.. ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా నెరవేర్చడం లేదన్నారు.
30 సంవత్సరాలు మాదిగ రిజర్వేషన్ సాధించడానికి పోరాటం చేసిన మా ఎమ్మార్పీఎస్. కులానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఉన్న పలు సమస్యలపై కూడా పోరాటం చేసిందని గుర్తు చేశారు. 200 ఉన్న పెన్షన్ నాలుగు వేలకు వరకు ఇచ్చే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెప్పించి విజయం సాధించిన ఘనత ఎమ్మార్పీ దే నని, గుండె జబ్బుల కలిగిన నిరుపేదల కు ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రిలలో చికిత్స అందించే ఆరోగ్యశ్రీ పథకానికి మూల కారణం ఎంఆర్పిఎస్ దేనని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధిక సంఖ్యలో వికలాంగులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
16 Nov 2025 23:44:24
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
