వర్షాల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలి.
ఎస్సై విమల ప్రజలకు పలు కీలక సూచనలు.
(లోకల్ గైడ్); బంట్వారం మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై విమల మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం ఉంటే తప్పా వర్షాల సమయంలో రైతులు, ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. వినాయక మండపాల దగ్గర, రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వాగులు వరద నీరు చేరి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని నాలాలు, సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు పొంచి ఉంటాయని కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే, ఏదైనా సంఘటన జరిగితే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్సై విమల మండల ప్రజలను కోరారు.