ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.వినాయక చవితి పురస్కరించుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా లంబోధరున్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలు,పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు.ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ప్రజల విఘ్నాలు తొలగాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు.విఘ్నాలు తొలగించే గణనాధుని ప్రజలంతా తమ ఇండ్లలో భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని,తగిన జాగ్రత్తలు పాటిస్తు తమ ఇండ్లలో గణేష్ నవరాత్రులు జరుపుకుని లంబోదరుని ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు.అనంతరం పట్టణంలోని బాబు క్యాంపు బస్తీలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. కమ్యూనిటీ హాలు చుట్టూ ప్రహరీ గోడ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే పలు నిర్మాణాలను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నిర్మాణం చేపట్టే విధంగా నిధులు సమీకరించేందుకు కృషి చేస్తానని స్థానిక దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మత్తమారి సూరిబాబు,ముచ్చర్ల మల్లయ్య,చిలుముల శంకర్ రత్నం ప్రదీప్,బండి రాము,దావ రమేష్,నిజాం,బండి లక్ష్మణ్,చిప్ప మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు