సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు రవీందర్ యాదవ్

సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు రవీందర్ యాదవ్

సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు రవీందర్ యాదవ్

సీనియర్ నేత రవీందర్ యాదవ్ వెల్లడి. ప్రతి ఒక్కరు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయ

 

 

 

 

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం సమావేశంను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలి అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఇదే స్పూర్తితో రానున్న ఎన్నికల్లో పని చేయాలి అన్నారు. కెసిఆర్ చేసిన అభివృద్ధి తప్పితే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు అన్నారు. శేరిలింగంపల్లి లో మొదటి నుంచి పార్టీ కోసం పని చేసే వారికి రానున్న రోజులలో మంచి అవకాశాలు ఉంటాయి అన్నారు. కార్యకర్తలు పార్టీకి బలం అని కేటీఆర్ చెప్పారని, అదే స్పూర్తితో ప్రతి ఒక్కరు పని చేయాలి అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని అన్నీ డివిజన్ ల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అని హర్షము వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమిరిశెట్టి సాయిబాబా, రవి యాదవ్, మిద్దెల మల్లారెడ్డి, చిన్న ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20250824-WA0126

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి