కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు

కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు

- తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడుస్తున్న ప్రజలు. - అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. - నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం - ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్  - కమల్ పూర్ గ్రామంలోని ఓ కాలనీ వాసుల ఆవేదన.

 

లోకల్ గైడ్/తాండూర్: యాలాల్ మండల పరిధిలోని కమల్ పూర్ గ్రామంలోని బోయిని కాలనీలో గత  నాలుగు నెలలుగా త్రాగునీరు అందక ప్రజలు దాహర్తితో అల్లాడిపోతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా వున్నాయి... యాలాల మండలం కమల్‌పూర్ గ్రామంలోని బోయిని కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.దీంతో కాలనీ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులతో పూట గడుపు తున్నారు.ప్రతి రోజు దూరప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకోవడం ప్రజలకు భారంగా మారింది.నీటి కోసం బాటిళ్లు, డబ్బాలతో కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.త్రాగునీటి సమస్య గురించి కాలనీ ప్రజలు పలుమార్లు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి సంపత్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొక పోగా విధులు పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,నీరు సరఫరా చేసి కమాల్ పూర్ ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు