రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆర్‌పి‌ఐ (అథవాలే) కార్యక్రమాలు


 *లోకల్ గైడ్:* 24/11/2025
హైదరాబాద్‌: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఈనాడు కార్యాలయం ఎదుట, హైదరాబాద్‌లో జరుగనుంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా, అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా, 2015లో భారత ప్రభుత్వం నవంబర్ 26నను అధికారికంగా “రాజ్యాంగ దినోత్సవం”గా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం దిశగా భారీ ఎత్తున నూతన నాయకుల చేరిక, సభ్యత్వ నమోదు కార్యక్రమం, రానున్న గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర కమిటీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరవాలని పార్టీ పిలుపునిచ్చింది. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం ఇచ్చింది. కార్యక్రమం అనంతరం భోజన ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు.

అలాగే, ఇదే రోజున ఉదయం 12 గంటలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)  మీటింగ్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరగనుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్‌రావు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు కావడంతో, ఈ సందర్భంగా  మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ సమావేశంలో ఇటీవల పార్టీలో చేరిన ఫణి భూషణ్‌ను సన్మానించడం, జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించడం, డిసెంబర్ 1న ఢిల్లీలో జరగనున్న నేషనల్  మీటింగ్ ఏర్పాట్లు,  మరింత పటిష్ఠం చేయడానికి అవసరమైన చర్యలపై నాయకుల అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్టు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు ఉదయం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు హాజరుకావాలని పేరం శివ నాగేశ్వర్‌రావు ఆహ్వానించారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి