మేకల దొంగలు అరెస్ట్.

మేకల దొంగలు అరెస్ట్.

నల్లగొండ. లోకల్ గైడ్.దేవరకొండ డివిజన్లోని కొండమల్లేపల్లి, నాంపల్లి, గుర్రంపోడు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న మేకలు, గొర్రెలను దొంగిలించిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ రాజు, రమేష్ వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం కొండమల్లేపల్లి చౌరస్తాలో పోలీసులు సాధారణ తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను ఆంబోతు గోపీచంద్, పొడిపాటి స్టాలిన్, ఉడుత శివతోపాటు ఓ బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆ నిందితుల నుంచి దొంగిలించిన మేకలు, గొర్రెలను విక్రయించగా వచ్చిన నగదు రూపాయలు రెండు లక్షల 20వేల నగదు స్వాధీనం చేసుకొని సదరు నిందితులను కోర్టుకు రిమాండ్ చేసినట్లు సిఐ తెలిపారు. నిందితులను తట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై అజ్మీరా రమేష్. క్రైమ్ సిబ్బంది ఏమో నాయక్, జి భాస్కర్, నవీన్ రెడ్డి, జగన్, వెంకన్న లను సీఐ అభినందించారు.

Tags:

About The Author

Latest News