ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్

ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్

లోకల్ గైడ్:
           
   ఒలంపిక్ డే రన్ కార్యక్రమంను  సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) వీరా రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) భువనగిరి నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్దకు తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించారు. ఈ సందర్బంగా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) జి. వీరా రెడ్డి, జిల్లా యువజన, క్రీడాల అధికారి  కే.ధనంజనేయులు  మాట్లాడుతూ ఒలింపిక్ దినోత్సవం నాడు, క్రీడల ద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే ఒలింపిక్ ఉద్యమం లక్ష్యాన్ని మనం జరుపుకుంటామన్నారు. క్రీడలు ఆడుతున్నపుడు,  మన మనస్సును, శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది జానకిరాములు, మురళి, రేణుక, జయ, శ్రీను, కైసర్ , రేణుక, భువనగిరి ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి దశరథ్ రెడ్డి, పిడి లు/ పి ఈ టి లు,  అసోసియేషన్,  క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు,  సభ్యులు క్రీడాకారులు యువత విద్యార్థిని విద్యార్థులు ప్రజా ప్రతినిధులు ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్