కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి యాదవులకు ఇవ్వాలి.
యాదవ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ .
నల్లగొండ, లోకల్ గైడ్. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి యాదవులకు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి, రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి,నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి,నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి లకు నల్లగొండ జిల్లా అధ్యక్ష పదవి యాదవులకు ఇవ్వాలని యాదవ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ కోరారు. బుధవారం యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని రెవెన్యూ అతిథి గృహంలో కలిసి వినతి పత్రాలు వేరు వేరుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ ఈసారి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. నల్లగొండ జిల్లాకు గతంలో ఉన్న ప్రభుత్వం రెండు ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ, ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్నారు . ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలో యాదవులకు ప్రాధాన్యత లేదన్నారు. కావున సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న ఈ ప్రభుత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి గతంలో ఎన్ ఎస్ యు ఐ ,యువజన కాంగ్రెస్ లో పని చేసి పార్టీకి విధేయుడుగా ఉన్న యువ నాయకులకు ఇస్తే బాగుంటుందన్నారు. జిల్లా అధ్యక్ష పదవి యాదవులకు ఇస్తే భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో అండగా ఉంటామని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో యాదవ విద్యావంతుల వేదిక అసోసియేట్ అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి కుంటిగొర్ల లింగయ్య యాదవ్, డివిజన్ అధ్యక్షుడు గుండెబోయిన సురేష్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షుడు నడ్డి శంకర్ యాదవ్, పట్టణ ప్రచార కార్యదర్శి జానాపాటి శంకర్ యాదవ్, పట్టణ కోశాధికారి మోదాల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.