నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ
నిజామాబాదు (లోకల్ గైడ్); నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక ముఖ్యమైన ప్రకటన.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు , నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టి ఏ ఎస్ కె ) యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని ఐటి టవర్స్‌లో ఏర్పాటు చేశారు .
ఈ సందర్భంగా, టిఏఎస్ కె ప్రాంతీయ కేంద్రాల యొక్క ముఖ్య అధికారి సవీన్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉన్నత స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల రిలేషన్షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలకు సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు.
టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో అందించబడే శిక్షణ కార్యక్రమాలు ఈ కింది విధంగా ఉన్నాయి .
1. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవసరమైన అర్థమెటిక్ మరియు లాజికల్ రీజనింగ్‌పై సమగ్ర శిక్షణ.
2. సాంకేతిక శిక్షణలో భాగంగా జావా, డేటా బేస్, పైథాన్ వంటి ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ.
3. సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ.
4. అన్ని రకాల ఉద్యోగాలకు అవసరమైన ఇతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు.
5. ప్రస్తుత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ICET కోచింగ్ కూడా అందుబాటులో ఉంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిజామాబాద్‌లోని టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి, దరఖాస్తు రుసుము ₹599/- చెల్లించి శిక్షణ కార్యక్రమాలలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
* ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు.
పైన తెలిపిన శిక్షణ కార్యక్రమాల యొక్క కొత్త బ్యాచ్‌లు ప్రతి నెలా ప్రారంభమవుతాయి. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మరింత సమాచారం కోసం, దయచేసి ఈ : 9154252588, 7013675052 నంబర్లను సంప్రదించాలని సూచించారు