రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్లను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పం
జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే
జడ్చర్ల/ మిడ్జిల్ :
శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా జడ్చర్ల పట్టణం లోని ప్రాచీన శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల పట్టణాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత నర్సింహులు జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ లు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
