ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే పద్మశ్రీ డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రంథాలయం లో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర్ష ప్రసంగిస్తూ గ్రంథాలయాల ప్రాముఖ్యత ని వివరించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల గ్రంధపాలకురాలు టీ. సునితారాణి మాట్లాడుతూ  డాక్టర్. ఎస్. ఆర్. రంగనాథన్ సేవలను గుర్తుచేస్తూ, లైబ్రరీస్ యొక్క ఆవశ్యకతను, పుస్తక పఠనం యొక్క అవసరాన్ని విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ ఎ. నీలిమ రెడ్డి, టీ .సునీతారాణి, ఎన్. అపర్ణ, ఎస్ కే సుల్తాన, శాంతి ప్రియ, అనిత, శ్రీలత, నస్రీన్, కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News