చదువురాని యువతి, యువకులకు గుర్తించాలి
-మండల విద్యాధికారి దూస రాములు వెల్లడి
-పాల్గొన్న మండల ఐకెపి సిబ్బంది
లోకల్ గైడ్ /బషీరాబాద్
బషీరాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చదువురాని యువతి, యువకులను గుర్తించి విద్యను అందించాలని మండల విద్యాధికారి దూస రాములు తెలిపారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బషీరాబాద్ లో బుధవారము ఐకెపి సిబ్బందికి వయోజన విద్యకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ..చదువు మధ్యలో మానేసిన,చదవడం రాయడం రాని యువతీ, యువకులను గుర్తించి వారికి విద్యను అందించాలని ఐకెపి సిబ్బందికి తెలిపారు. అదేవిధంగా వారి వివరాలను ఉల్లాస్ యాప్ నందు పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పద్మారావు, సిఆర్పిలు దత్తాత్రేయ, రాములు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కమల్నాథ్, ఐకెపి సిబ్బంది సీసీలు మరియు వివో ఏ లు తదితరులు పాల్గొన్నారు