పాశ మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై

పాశ మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై

-ప్రభుత్వం నుండి పూర్తి సహాయం సహకారాలు అందిస్తాం -పిఏసి చైర్మన్..ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని మదినగూడాలో గల ప్రణం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజానర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంబిసి చైర్మన్ జేరిపేటి జైపాల్,  డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహ రెడ్డి, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి లతో కలిసి క్షతగాత్రులను పరామర్శించి, ప్రణం ఆసుపత్రి ఎండి గౌరవ్ ని అడిగి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన పీఏసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా పిఏసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ..పాశ మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన  దురదృష్టకరమని, తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అని, తీవ్రంగా కలిచివేసింది అని తెలియచేసారు. ప్రభుత్వం బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని, దీనిపై మంత్రి దామోదర రాజానర్సింహ నిమిషం నిమిషం పర్యవేక్షిస్తున్నారని  తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..స్వయంగా ఘటన స్థలాన్ని సందర్శించి, పూర్తి వివరాలపై ఆరా తీశారని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్  సంఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించామని, చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.ఫ్యాక్టరీ స్థలంలో ప్రత్యేకంగా ఇంఛార్జీలను నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 45 మంది మరణించారని, మరో 8 మంది బుధవారం డిశ్చార్జి అవుతున్నారని తెలిపారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్