శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ మహిమలు చూపిన మహానుభావుడు

శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ మహిమలు చూపిన మహానుభావుడు

కేశంపేట మండలం దేవుని గుడి తండాలో సేవాలాల్ జయంతి వేడుకలు

జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

లోకల్ గైడ్ న్యూస్ -కేశంపేట

 బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మహిమాన్విత పురుషుడని, అనేకమైన మహిమలు  చూపి ఆదర్శప్రాయుడయ్యాడని, ఉత్తమమైన బోధనల ద్వారా బంజారాల ఆరాధ్య దైవం అయ్యాడని  ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం దేవుని గుడి తండాలో  శ్రీ సంతోష్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని పురస్కరించుకొని బంజారా లు సేవాలాల్ జయంతి వేడుకలు జరిపారు. శివ లాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నగర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు సాదరంగా ఆహ్వానించగా  సేవాలాల్ జయంతి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సంతోష్ సేవాలాల్ మహారాజ్ యొక్క బోధనలు, ఆయన చూపిన ఆదర్శం, ఆయన చూపెట్టిన సన్మార్గం కేవలం బంజారా జాతికి మాత్రమే కాకుండా మానవమాత్రులందరూ పాటించాల్సినవేనని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి గూడ మాజీ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,పోమాల్ పల్లి మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి,ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు,శ్రీను, ప్రకాష్, జగన్, శ్రీకాంత్, నాగిళ్ళ వెంకటేష్, దేవునిగుడి తండా వాసులు బద్రు నాయక్,శ్రీరామ్, కిషన్, వి శ్రీరామ్, హన్మంత్, బాలు నాయక్, లక్ష్మణ్, బుజ్జి, మోత్య, ఉమ్లా, శంకర్ నాయక్, రవి, శివా చారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్