విద్యార్థి తండ్రిపై దౌర్జన్యంగా ప్రవర్తించి బయటికి తోసేసిన గురుకుల ఇంటర్ విద్యార్థులు.
తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి తండ్రి శేఖర్.
లోకల్ గైడ్, కొందుర్గు:తమ కొడుకును చూడడానికి వెళ్లిన ఓ తండ్రిపై గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు దౌర్జన్యంగా పాఠశాల నుండి బయటికి తోసుకుంటూ బయటికి గెంటేసిన ఘటన కొందుర్గు మండల కేంద్ర పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే పద్మారం గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి తమ కుమారున్ని ఆదివారం సెలవు రోజు ఉన్నందున చూసేందుకు గాను గురుకుల పాఠశాలలోకి వెళ్లారు. కుమారుని చూసి అతని బాగోగులు అడిగి తెలుసుకుని సమయంలోపు అదే గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న కొంతమంది ఇంటర్ విద్యార్థులు లోపలికి ఎందుకు వచ్చావు అంటూ దౌర్జన్యంగా గెంటేసుకుంటూ గేటు బయటకి తోయడం జరిగింది. దీంతో విద్యార్థి తండ్రి అయిన శేఖర్ ఎందుకిలా చేస్తున్నారు. నేను నా కుమారుని చూసేందుకు వస్తే విద్యార్థులుగా మీరు నాపై ఎందుకిలా బలవంతంగా తోసేస్తారని ప్రశ్నించాడు. దీంతో ఆ విద్యార్థులు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మాదే ఇష్ట రాజ్యం అన్న విధంగా వారిని బలవంతంగా బయటికి తోసేయడంతో వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఈ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారా ..? లేదా విద్యార్థులకు ఎలాంటి క్రమశిక్షణ లేకుండా నన్ను ఈ విధంగా బలవంతంగా తోసేయడం ఎంతవరకు సబబు అని అన్నారు. పాఠశాలలో ఇంటర్ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉండాలి కానీ ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని వారన్నారు.ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారా లేదా గుండా గిరిని నేర్పిస్తున్నారా, ఒక విద్యార్థి తండ్రిగా నన్ను ఈ విధంగా విద్యార్థులు అవమానకర రీతిలో బయటికి పంపేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని వాపోయారు. నాపై అసభ్యకరంగా ప్రవర్తించిన విద్యార్థులపై సంబంధిత ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాలని కోరారు.
About The Author
Related Posts
