13 నా ఊర పండుగ వేడుకలు...
సర్వసమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బండారు కార్యక్రమం...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (లోకల్ గైడ్) గ్రామ దేవతల ఆశీర్వాదంతో ప్రజలు పాడిపంట పిల్లాపాపలతో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సుఖ సంతోషాలతో ఉండేందుకు గ్రామ దేవతలను పూజిస్తూ ఊర పండుగ వేడుకలను వందల సంవత్సరాల నుండి సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కులస్తుల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈనెల 13వ తేదీ ఊర పండుగ కార్యక్రమం నిర్వహించేందుకు సర్వ సమాజ కమిటీ నిర్ణయించింది.. ఈ నేపథ్యంలో నేడు సర్వసమాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బండారు పోసి ఊర పండుగ వేడుకలను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీలు మల్కాయ్ సుదర్శన్, పసుల రాజు కార్యవర్గ సభ్యులు కొత్మీర్ సతీష్, విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సుంకటి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి పాల్వంచ గంగాధర్, పెద్ద కాపులు కోరడి చిన్న నర్సయ్య, మల్కాయ్ లక్ష్మినారాయణ, కోర్వ భూపాల్, గంట పెద్ద నర్సయ్య, ప్రతినిధులు భైర శైలేందర్, కోరడి గోపి, ఈర్ల సాయన్న, ఆదే నర్సయ్య, వెల్మల్ గంగాధర్, కోటకింది నర్సయ్య, కొత్మీర్ పెద్ద సాయన్న, నరాల చక్రధర్, బెల్లల్ కుమార్, రామాడ్గు బాలకిషన్, మల్కాయ్ మహేందర్, సుంకటి శేఖర్, కోటకింది శేఖర్, కొట్టె సాయిబాబా, సుంకేటి విశాల్, భైర రమేష్ తదితరులు పాల్గొన్నారు.