బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...
By Ram Reddy
On
భయాందోళనలో కాలనీవాసులు...
నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం బీడి వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఒకపక్క ఊర పండగ సంబరంగా జరుపుకుంటుంటే మరోపక్క చిరుత సంచారంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.. నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు సాయంత్రం 6.55 నిమిషాల ప్రాంతంలో చిరుత పులి కనబడటంతో భయందోళనకు గురయ్యారు. స్థానికంగా 300 క్వార్టర్స్ వద్ద వాటర్ ట్యాంక్ వద్ద కనబడంతో ప్రజలు నిజామాబాద్ నార్త్ రెంజ్ ఫారెస్ట్ ఆఫిసర్ సంజయ్ గౌడ్ కు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారం వాస్తవమని అన్నారు. ఆటవి శాఖ సిబ్బందిని స్థానికంగా అనవాళ్లు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు..
Tags:
About The Author
Related Posts
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
