ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేయండి – సీఎం రేవంత్ ఆదేశాలు

“జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి – ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి”

ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేయండి – సీఎం రేవంత్ ఆదేశాలు

 

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం, సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

  • వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

  • లోతట్టు ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, చెరువులు, కుంటలు నిండుతున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణ సహాయం అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని, ఉన్నతాధికారులు కలెక్టర్లతో నిరంతరం సమీక్ష కొనసాగించాలని ఆయన ఆదేశించారు.

Tags:

About The Author

Latest News