హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం.

హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం.

నల్లగొండ ప్రతినిధి. లోకల్ గైడ్.

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హౌసింగ్ బోర్డ్ కాలనీలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  చిత్రపటానికి దరఖాస్తుదారులు బుధవారం పాలాభిషేకం చేశారు. ప్లాట్ల కోసం గతంలో డబ్బులు కట్టిన 90 మందికి న్యాయం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కనగల్  మాజీ జెడ్పిటిసిలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశంలు మాట్లాడుతూ వినాయక హౌసింగ్ బోర్డ్ కాలనీలో 15 సంవత్సరాల క్రితం ప్లాట్ల కోసం 90 మంది డబ్బులు కట్టిన డ్రాలో రాలేదని తెలిపారు. 
దీంతో డబ్బులు కట్టిన వారంతా గత 15 సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నారని అన్నారు. ఇటీవల హౌసింగ్ బోర్డు కాలనీలో ప్లాట్ల కోసం అధికారులు డ్రా తీయగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మురళి గౌడ్, అయితగోని  కృష్ణ గౌడ్, మారగోని రామచంద్రం, వేమిరెడ్డి భూపాల్ రెడ్డి, కదిరే సైదులు,మర్రి రమేష్, వడ్డే  నగేష్,బుర్రి వెంకట్ రెడ్డి,దోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.             సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.            
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శాఖీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దొంతి...
రీయింబర్స్మెంట్ ఫీజులను విడుదల చేయాలి
విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇప్పించాలి.
_నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు..._
తెలుగులోనూ రాణించాలన్నదే
హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం.
పోస్ట్ మ్యాన్ లపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు