పరిగిలో రోడ్డు ప్రమాదం: ఒకరి దుర్మరణం
By Ram Reddy
On
(లోకల్ గైడ్) పరిగి: పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నవాబుపేట్ మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరిగూడెం శ్రీనివాస్ (35) తన బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డీసీఎంను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
About The Author

Latest News
31 Jul 2025 18:28:56
మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.