ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మంత్రితోపాటు హాజరైన తెలంగాణ ఎంపీలు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగా రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, NH CE ధర్మా రెడ్డి, ఇతర నేతలు…
ఎల్ బీ నగర్ - మల్కాపూర్ : చింతల్ కుంట చెక్ పోస్ట్ నుంచి హయత్ నగర్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5 ½ కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించడంతో పాటు నాగ్ పూర్ లో మాదిరిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మాణం చేపట్టాలని గడ్కరీని రిక్వెస్ట్ చేసిన మంత్రి.
• కోమటిరెడ్డి చేసిన విజ్ఞప్తికి ఓకే తెలిపిన గడ్కరీ. అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే మంజూరీలు ఇస్తానని తెలిపిన గడ్కరీ.
• ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం వియూపీలు నిర్మించడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతామని ప్రభుత్వానికి స్థానిక ప్రజలు కోరుతున్నందున.. దాన్ని ఎలివేటెడ్ గా మంజూరీ చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించిన గడ్కరీ.
డెత్ రోడ్డుగా పిలిచే హైదరాబాద్-విజయవాడ రహదారిపై (NH-65) జూలై 27 న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీల మృతి చెందిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చిన మంత్రి.. చలించిపోయిన గడ్కరీ.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ.. ఆగష్టు 15 వ తేదీన నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో ఎన్.హెచ్-65 విస్తరణను ఆమోదిస్తామని.. త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని, వెంటనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డికి హామీ ఇచ్చిన గడ్కరీ.
హైదరాబాద్-విజయవాడ NH-65 ను 6 లైన్లుగా విస్తరించి, సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు గడ్కరీ అంగీకరించారు. RRR ఉత్తర భాగం పనులను 6 లైన్లుగా రూపొందించి 3 నెలల్లో ప్రారంభించేందుకు సూచించారు. శ్రీశైలం రహదారిలో టైగర్ రిజర్వ్ వద్ద ఎలివేటెడ్ కారిడార్‌కు అప్రూవల్ హామీ లభించింది. మన్నెగూడ రహదారిపై NGT సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. HAM విధానంలో రోడ్లు, ఉప్పల్ ఫ్లైఓవర్ వంటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అన్ని రహదారుల అభివృద్ధికి మద్దతుగా గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు.
About The Author
