మంచు మనోజ్, హనుమ రెడ్డి యక్కంటి, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ పవర్ ఫుల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి డైనమిక్ పోస్టర్ తో అనౌన్స్‌మెంట్

మంచు మనోజ్, హనుమ రెడ్డి యక్కంటి, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ పవర్ ఫుల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి డైనమిక్ పోస్టర్ తో అనౌన్స్‌మెంట్

        రాకింగ్ స్టార్ మనోజ్ మంచు తన పాత్రలను, స్క్రిప్ట్‌లను సెలెక్టివ్‌గా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు. తన తాజా ప్రాజెక్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించగా, వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుళ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. హిస్టరీ, రెబెలియన్‌తో కూడిన ఈ చిత్రం తెలుగు సినిమాకి ఓ మైల్ స్టోన్ కానుంది. 

      డేవిడ్ రెడ్డి అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కథ 1897 నుంచి 1922 వరకూ నడుస్తుంది. ఈ స్టోరీలో మనోజ్ ఎన్నడూ చూడని పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబడి, బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఓ రెబల్ కథ ఇది. కథ రా, గ్రౌండెడ్, ఎమోషనల్ మాస్ టచ్‌ తో జనం గుండెల్లో నిలిచిపోయేలా వుంటుంది. 

      21 సంవత్సరాల క్రితం, ఇదే రోజున మంచు మనోజ్ దొంగ దొంగదితో అరంగేట్రం చేశారు. ఇప్పుడు, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, తన న్యూ బ్లాస్టింగ్ వెంచర్ డేవిడ్ రెడ్డిని ప్రకటించడం విశేషం. సినిమా ప్రేమికులకి ఇది మరిచిపోలేని మెమొరబుల్ మూమెంట్.

      ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. తెరపై చూపించే విప్లవానికి టోన్‌ను సెట్ చేస్తుంది. టైటిల్ డిజైన్‌ని మనోజ్ ఫేస్‌లోకి మార్చడం చాలా క్రియేటివ్ గా వుంది. "మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు!" అనే ట్యాగ్‌లైన్‌ కట్టిపడేసింది. విజువల్ గా అద్భుతమైన పోస్టర్ సినిమా ఎంత పవర్‌ ఫుల్ గా వుంటుందో తెలియజేస్తోంది.

Tags:

About The Author

Related Posts

Latest News

అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం? అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం?
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు రాఖి కట్టిన అక్క చెల్లెలు 
గురుకుల విద్యార్థులు ఇక సురక్షితం
హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
ఎనుముల తిరుపతి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్...
ఎమ్మెల్యే మర్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి 
శ్రీ శక్తి ఆలయంలో రక్షా బంధన్-పాల్గొన్న ఎమ్మెల్యే