ప్రవహించే మున్నేరు నీటిని...పరివాహక, సమీప ప్రాంతాలకు ఇవ్వకపోవడం అన్యాయం 

ప్రవహించే మున్నేరు నీటిని...పరివాహక, సమీప ప్రాంతాలకు ఇవ్వకపోవడం అన్యాయం 

మహబూబాబాద్ ప్రతినిధి లోకల్ గైడ్

ఈ ప్రాంత నీటిని పాలేరు రిజర్వాయర్ కు తరలించే కుట్ర చేస్తున్న ఖమ్మం, సూర్యాపేట జిల్లా మంత్రులు.

మున్నేరు ప్రాజెక్టు నీటిని గార్ల, బయ్యారం, డోర్నకల్ తదితర సమీప ఖమ్మం రూరల్ మండలం ప్రాంతాలకకు యివ్వాలి.

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్...

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మహబూబాబాద్ నియోజక ఖమ్మం రూరల్, కామేపల్లి ప్రజల చిరకాల వంచ...

ఈ ప్రాంత మున్నేరు ప్రాజెక్టు ప్రజల ఐదున్నర దశాబ్దాల కల అని, గార్ల, బయ్యారం, డోర్నకల్, కొరివి, కామేపల్లి తదితర మండలాల సాగునీటి అవసరాల కోసం డిజైన్ చేయబడ్డ ప్రాజెక్టును ఇప్పుడు ఈనగాచి నక్కల పాలైనట్లుగా ఉందని ప్రస్తుత మున్నేరు వరద నీరు దోపిడీ దారుల విధానంగా ఉందని పలువురు వక్తలు అన్నారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ ఎం. ఎల్ (న్యూడెమోక్రసీ) పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జడ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ముఖ్య వక్తగా పాల్గొనగా, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్రావు, తెలంగాణా విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, అడ్వకేట్ జంపాల విశ్వ,  సీపీఐ ఎంఎల్  జరిగిన  న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, సీపీఎం జిల్లా నాయకులు మండా రాజన్న, బీఆరెస్ మండల అధ్యక్షులు తాత గణేష్, మాస్ లైన్ మండల కార్యదర్శి బిల్లకంటి సూర్యనారాయణ, టీడీపీ మండల నాయకులు నామా బాబురావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భీముడు నాయక్, వివిధ పార్టీల నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మోకాళ్ళ మురళీ క్రిష్ణ, గుగులోత్ సక్రు, ఎనుగుల ఐలయ్య, నంబూరి మధు, న్యూడెమోక్రసీ నాయకులు తుడుం వీరభద్రం, యాకన్న, రామగిరి బిక్షం, మాదంశెట్టి నాగేశ్వరరావు, ఏపూరి వీరభద్రం, గౌని భద్రయ్య, తోకల వెంకన్నలు 
ప్రసంగిస్తూ.... మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాలోని పాలేరుకు మూడో పంటకు, వారి త్రాగునీటి అవసరాలకు తరలించుకపోవటం అత్యంత దుర్మార్గకరమైన చర్య అని వక్తలు విమర్శించారు. 

 ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు 1969లో ఆనాటి దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య  ప్రాజెక్టు సర్వే కోసం ఆనాడే 1 లక్షరూపాయలు కేటాయించారని, ఆ తర్వాత 1985లో తెలుగు దేశం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సర్వేకోసం 10 లక్షలు కేటాయించిందని, 1995లో ఈపాజెక్టు నిర్మాణం కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని, 2009లో నాటి ముఖ్య మంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 136 కోట్లు  మంజూరు చేస్తూ జీవో  1076ను విడుదల చేశారని వారు అన్నారు . వైస్సార్ మరణంతో ఈ ప్రాజెక్టు మూలన పడిపోయిందని వక్తలు ఆ సమావేశంలో వక్తలు ఆవేదన వ్యక్తం చేసారు. 

కీ.శే. టంగుటూరి అంజయ్య నుండి వైయస్  రాజశేఖర్ రెడ్డి వరకు చంద్రగిరి, రెండేర్లగడ్డ, మున్నేరు పేర్లతో ఈప్రాజెక్టు కోసం జరిగిన సర్వేలు, ప్రతిపాదనలన్నీ ఈ ప్రాంత ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించినవేనని వారన్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మంత్రులు ప్రధాన భూమిక పోషించి, సూర్యాపేట జిల్లాకు చెందిన మరో మంత్రి సహాయంతో ఈ మున్నేరు నీటి దోపిడీకి బాటలు వేశారని, ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా మే 17, 2025న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 98 ద్వారా మున్నేరు వరద ప్రాజెక్టు నీరును పాలేరు జలాశయంకు తరలించే కుట్ర కోసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 162.54 కోట్లు కేటాయించడం పట్ల వక్తలు విచారం వ్యక్తం చేసారు. ఈ మున్నేరు ప్రాజెక్టును సీతారామ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 3 టి. ఎం. సిల నీటి సామార్థ్యం ఉన్న పాలేరు లింకు కెనాల్ కు అనుసంధానం చేసి 10 టీఎంసీల నీటిని పాలేరు రిజర్యాయిర్ కు తరలించి తద్వారా ఆ రిజర్వాయర్ కింది వున్న 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు మూడో పంట కోసం ఆయా ఆయకట్టు స్థిరీకరణ కోసం ఈ ప్రాంత రైతుల ప్రయోజనానికి గండి కొడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డీలు ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు. 100 సంవత్సరాల క్రితం నిర్మించ బడిన పాలేరు రిజరాయర్ కు కృష్ణా నది జలాలు, పాలేరు ఏరు నీరు, సీతారామ ప్రాజక్ట్ నుండి గోదావరి జలాలు అన్ని పాలేరు రిజర్వాయర్ కే అనుసంధానం చేయబడ్డాయని, గోదావరి నది నీటిని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీటిని పాలేరు రిజర్వాయర్ కు యివ్వటానికి ఉద్దేశించిన లింక్ కెనాల్ ను డైవర్ట్ చేసి మున్నేరు నీటిని దోపిడీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పాలకులు తెరలేపడం అన్యాయంగా ఉందని వారు ఆరోపించారు. 

క్రిష్ణా, గోదావరి, పాలేరు నదుల వచ్చే నీళ్ళు సరిపోయినప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా ఇక్కడ నీటిని దొంగిలించే పనికి పూనుకున్నారని పాకాల నుండి వచ్చే మున్నేరు, బయ్యారం చెరువు నుండి వచ్చే అలిగేరు నీళ్ళను కూడా పాలేరుకు తీసుక పోవటానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం దుర్మార్గమైన చర్య అని వారన్నారు. ఎలాంటి సాగునీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళు యిస్తామని డీపీఆర్ లో  పెట్టిన అప్పటి తెరాస ప్రభుత్వం రీడిజైన్లో గార్ల, బయ్యారం మండలాలను తొలగించి సుదూర ప్రాంత్రాలకు, క్రిష్ణా నది ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి జలాలను తీసుకెళుతూ ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వారు మన తలాపున ఉన్న మన మున్నేరు వరద నీళ్ళను క్రిష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం తీసుకెళ్తూ మన నోట్లో మన్ను కొడుతున్నారని, దీనినిఇక్కడి ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాలన్నారు. మున్నేరు ప్రాజెక్టు జలాలు ఈ ప్రాంత ప్రజల సాగునీటి అవసరాలకే ఉపయోగ పడాలని ఈ పాంత్రానికి అన్యాయం చేస్తూ పాలేరుకు తీసు కెళ్ళే నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని వారు ప్రభుత్వాన్ని డిమండ్ చేశారు. మున్నేరు ప్రాజెక్టు వీటిని గార్ల బయ్యారం, డోర్నకల్ తదితర పరివాహక ప్రాంత అవసరాలకు కేటాయించాలని, మున్నేరు జలాల దోపిడీ నుండి ఇక్కడ రైతంగా రక్షణ కోసం  ఐక్య పోరాటానికి ముందుకు రావాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. అనంతరం మున్నేరు ప్రాజెక్టు జలాల రక్షణ కోసం ఐక్య వుద్యమానికి పూనుకోవాలని తీర్మానం ఆమోదించారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి