సిద్దిపేటలో మీడియా అకాడమీ శిక్షణా తరగతులు
లోకల్ గైడ్, సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో, శుక్రవారం నాడు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు విజయవంతంగా ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక శాసన సభ్యులు, మాజీ మంత్రి టి. హరీష్ రావు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, స్థానిక ఎమ్మెల్సి దేశపతి శ్రీనివాస్, అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావులు పాల్గొన్నారు. శిక్షణ తరగతుల కో-ఆర్డినేటర్ గా సీనియర్ జర్నలిస్ట్ కే. రంగాచారీ వ్యవహరించారు. మొదటి రోజు తరగతులకు సుప్రసిద్ధ పాత్రికేయులు ఆర్.దిలీప్ రెడ్డి (సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్), ఆర్.వి.రామారావు (విశాలాంద్ర పత్రికా ఎడిటర్), మార్కండేయ (దిశ పత్రికా ఎడిటర్) లు మోడరేటర్స్ గా హాజరయ్యారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే.రాజిరెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
