ప్రణాళిక బద్ధంగా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి...
నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు..
పెద్దపల్లి ఓదెల జూలై,31 (లోకల్ గైడ్); తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా కొత్త పాలకవర్గాన్ని నియమించింది. పాలకవర్గ సభ్యులను ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య గారిని మరియు నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన తదుపరి పాలకవర్గం సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ...పెద్దపల్లి జిల్లాకు ప్రసిద్ధి చెందిన ఓదెల మల్లన్న ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. పాలకవర్గ సభ్యులు సేవా భవంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు పాటుపడాలని సూచించారూ
About The Author
