రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

-ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల నివాసాల జోలికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం

-శేరిలింగంపల్లి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామంటూ పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటలను అమలు చేస్తామని ఒక్క ఉచిత బస్సు తప్ప మిగతా ఐదు గ్యారెంటీల ఊసులేదని వాటి గురించి ప్రజలు ప్రశ్నిస్తారని ముందుగానే ఏడవ గ్యారెంటీ పేరుతో అమలు చేస్తామని ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని వికాలాంగులకు ఆరు వేలు, వితంతులకు వృద్ధులకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామని ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలసరి జమ చేస్తామని అనేక వాగ్దానాలు చేసిన ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల ఇస్తామని మోసం చేసిందన్నారు. పొట్ట చేత పట్టుకొని అనేక సంవత్సరాల క్రితం హైదరాబాదు మహా నగరానికి విచ్చేసిన ప్రజానీకానికి ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో అనేక బస్తీలు నిర్మాణం చేస్తే ఆ బస్తీలలో ఉంటున్న ఇండ్లను పడగొట్టి జి ప్లస్ టు ఇందిరమ్మ ఇండ్లు 
కట్టిస్తామంటూ రెవెన్యూ, హౌసింగ్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి అధికారులు ప్రజల మీద ఒత్తిడి తేవడం సవాబు కాదన్నారు. ఇండ్లు నిర్మించుకొని ఏళ్ల తరబడి ఉంటున్న వారికి పట్టాలి ఇచ్చి చట్టబద్ధత చేయడం వదిలేసి ఉన్న ఇల్లు తీసి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడం అని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రధానంగా శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల చేతిలో అన్యక్రాంతం ఆతుంటే వాటిని కాపాడి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాలని, గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్లను అందరికీ పంపిణీ చేయాలని ఎంసిపిఐ(యు) డిమాండ్ చేస్తుంటే స్థానిక అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదల ఇండ్లకు హాని కలిగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ..గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు అందరికి కట్టిస్తామని మోసం చేసిందని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరోసారి మోసం చేస్తుందని ప్రభుత్వాల స్వభావం ఒకటేనని అది ప్రజలను మోసం చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు కొమ్ము కాయడమే అని ప్రజలు గ్రహించాలని తెలిపినారు. ప్రభుత్వం బడా బాబులను వదిలి పేదల జోలికి రావడమే మురికివాడలలో నివాసాల జోలికి పనిగా పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. మురికివాడలలో నివాసముండే ఇండ్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేసిన
ఆనంతరం ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. మియాపూర్ సర్వేనెంబర్ 28లో ఓంకార్ నగర్ నడిగడ్డ తాండ సుభాష్ చంద్రబోస్ నగర్ లలో సిఆర్పిఎఫ్ సిబ్బంది తోటి ప్రజలకు హాని ఉందని ఆరోపించారు. వర్షాకాలంలో ఇల్లు కూలిపోతే అలాగే మరుగుదొడ్లు నిర్మించుకున్న సిఆర్పిఎఫ్ సిబ్బంది వెంటనే చేరుకొని ప్రజలను మహిళలను హింసిస్తున్నారని భయ ఆందోళన గురి చేస్తున్నారని తక్షణం తహసీల్దార్ జోక్యం చేసుకొని సిఆర్పిఎఫ్ సిబ్బందిని నివారించాలని, తాండ వద్దగల క్యాంప్ ఆఫీసును ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మియాపూర్ పరిధిలోని ముజాఫర్ అహమ్మద్ నగర్, స్టాలిన్ నగర్, టేకు నరసింహనగర్, పోగుల ఆగయ్య నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, నడిగడ్డ తాండ, ఓంకార్ నగర్ తదితర కాలనీలా పేదల నివాసాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలి ఇచ్చి ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల ఇళ్ళ జోలికి వస్తే భవిష్యత్తులో పోరాటాలే ప్రభుత్వానికి కనబడతాయని తెలియజేశారు. ధర్నా అనంతరం స్థానిక శేరిలింగంపల్లి తహసీల్దార్ కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంసిపిఐ(యు) నాయకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, తాండ్ర కళావతి, వి తుకారాం నాయక్, కర్ర దానయ్య, గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు బి విమల, మియాపూర్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు జి లలిత, వి అనిత, డి నర్సింహా, బి అరుణ, ఇషాక్, ఏఐఎఫ్ డివై  హైదరాబాద్ కమిటీ నాయకులు దేపూరి శ్రీనివాసులు, విద్యార్థి సంఘం నాయకులు యం శ్రీకాంత్ పార్టీ సభ్యులు యం రాములు, చైతన్య, ఈశ్వరమ్మ, ఇందిరా, వెంకటేశ్వరరావు, అబ్దుల్లా, ఖాదర్ వల్లి, జంగయ్య, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి