అధ్వాన రహదారి..అశాంతిలో ప్రయాణం.
మట్టి రోడ్డు అధ్వాన స్థితిపై స్పందించని అధికారులు.
లోకల్ గైడ్/ తాండూర్:
పెద్దేముల్ మండల పరిధిలోని ఘాజీపూర్ హైలెవెల్ బ్రిడ్జి వద్ద రహదారి పూర్తిగా అధ్వానంగా మారి.....వాహనదారులకు, ప్రయాణికులకు అశాంతిని కలిగిస్తుంది.గత నాలుగు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు,నీరు మొత్తం గుంతల్లో చేరి మట్టి రోడ్డు మొత్తం చిత్తడి చిత్తడిగా తయారై,అద్వానంగా మారింది.దీంతో,రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిత్యం తాండూర్-సంగారెడ్డి ప్రధాన రహదారి గుండా వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటారు.అయితే, భారీ వర్షాల కారణంగా, రోడ్డుపైన పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, ప్రయాణం చేయడం చాలా కష్ట తరమవుతుందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, ఉదయం పిల్లలను తాండూర్ పాఠశాలలకు పంపాలంటే బ్రిడ్జ్ వద్దనే అధిక సమయం తీసుకోవడం వల్ల,విద్యార్థులు సకాలంలో స్కూళ్లకు చేరలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ఇదిలా ఉంటే, బ్రిడ్జి నిర్మాణ పూర్తయిన తర్వాత....బీటీ రోడ్డు నిర్మించకపోవడంతో, గత రెండు సంవత్సరాల నుంచి, వర్షాకాలం వచ్చిందంటే నీరు మొత్తం గుంతల్లో చేరడంతో,ప్రతి అడుగు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఉదయం,మధ్యాహ్నం ఎంతోకొంత ఆచితూచి ప్రయాణించినప్పటికీ,రాత్రి సమయంలో ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఎక్కడ వాహనాలు బోల్తా పడతాయేమోనని వాహనదారులు బిక్కు బిక్కుమంటున్నారు.ముఖ్యంగా పెద్దేముల్ నుంచి తాండూర్ వెళ్లే మార్గంలో, రహదారి పైన అనేక చోట్ల గుంతలు ఏర్పడి రహదారి మొత్తం అధ్వానంగా మారడంతో,నరకయాతన పడుతున్నామని వాహన దారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ....ఎవరైనా అనారోగ్యంతో గాని,గర్భిణి స్త్రీలు, స్కూల్లకి వెళ్లే విద్యార్థులు,ద్విచక్ర వాహనాల పైన వెళ్లే ప్రయాణికులు ఈ రోడ్డుపైన ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధానంగా గర్భిణీ స్త్రీలను,అనారోగ్యంతో బాధపడే రోగులను తాండూరు తీసుకెళ్లాలంటే...రోడ్డు బాగా లేకపోవడంతో,మార్గ మధ్యలోనే ఏదైనా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.కాబట్టి తక్షణమే,తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందించి,ఆర్అండ్ బి శాఖ అధికారులను ఆదేశాలిచ్చి రహదారి పైన ఏర్పడిన గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.
About The Author
