తెలుగు సాహితీ వినీలాకాశంలో ధృవతార 'సినారె' : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, లోకల్ గైడ్; తెలుగు సాహితీవేత్త ,జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారే) అనేక రచనలు సమాజాని ప్రభావితం చేసేలా ఉండేవని
మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం తెలుగు సాహితీవేత్త ,జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...తమ పూర్వ కరీంనగర్ జిల్లా హనుమాజీపేట గ్రామానికి చెందిన సీ.నారాయణ రెడ్డి పద్య ,గేయ కావ్యాలు, చలన చిత్ర గీతాలు,యాత్ర కథనాలు, సంగీతం, నృత్య రూపకాలు, విమర్శన గ్రంధాలు రాశారని తెలిపారు. ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించిందని చెప్పారు. సినారె రచించిన అనేక రచనలు సమాజాన్ని మేలుకొలిపేలా ఉండేవని తెలిపారు. ఆయన మూడు వేలకు పైగా సినిమా పాటలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. ఆయన పాండిత్యం తెలుగు భాషాభివృద్ధికి చేసిన విశేష కృషి సినారెను తెలుగు సాహితీ వినీలాకాశంలో ధృవతార గా నిలిపిందన్నా రు. ఆయన రాజ్యసభ సభ్యుడి తో పాటు ఎన్నో గొప్ప గొప్ప పదవులు అలరించి విశిష్ట సేవలందించారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు.
About The Author
