ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
పోలీస్ స్టేషన్ ముందు నుంచి యదేచ్చగా నాపరాతి తరలింపు.
By Ram Reddy
On
వాహన దారుల పైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల వినతి.
ఓవర్ లోడ్ వాహనాలతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పట్టణ ప్రజలు వాపోతున్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు నుంచి నిత్యం పదుల సంఖ్యలో నాపరాతినీ తరలిస్తున్నారు.ఇది ఇలా ఉంటే గత పది రోజుల క్రితం చేవెళ్ల ఘటన యావత్ ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఓవర్ లోడ్ వాహనాలను చూసి వాహనదారులు, ప్రజలు జంకుతున్నారు. ఏ క్షణంలో తమపై పడుతుందోనని వాహనదారలు, స్థానిక ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఒకవేళ వాహనం పైనుంచి నాపరాయి కిందకు జారిపడితే కనుక ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఓవర్ లోడ్ వాహనాలను కట్టడి చేసి, తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Tags:
About The Author
Latest News
16 Nov 2025 23:44:24
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
