ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి

జిల్లా న్యాయమూర్తి పీ వసంత్ 

ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి

కొత్తగూడెం   లోకల్ గైడ్ :
కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం అనేది కీలకపాత్ర పోషిస్తుందని, న్యాయవాదులు దానిపై పక్కా అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి శ్రీ పీ వసంత్ తెలిపారు. శనివారం జిల్లా న్యాయవాదుల లైబ్రరీ హాల్‌లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పీఏ) ఆధ్వర్యంలో “కోర్టు కేసులలో ఫోరెన్సిక్ సాక్ష్యం ప్రాముఖ్యత” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రో-బ్లాక్ డైరెక్టర్ శ్రీ మోహన్ ఎర్రగోళ్ల మాట్లాడుతూ,భారత సాక్ష్య చట్టంలో ఫోరెన్సిక్ సైన్స్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ,నేటి రోజుల్లో ఫోరెన్సిక్ పరిశోధనల అవసరం మరింత పెరిగిందని తెలిపారు. న్యాయవాదులు ఈ రంగంలో నేర్చుకోవాల్సిన నైపుణ్యాలను ప్రస్తావిస్తూ పాలిగ్రఫీ టెస్ట్,ఫింగర్ ప్రింట్ అనాలసిస్, నార్కో అనాలిసిస్, హ్యాండ్ రైటింగ్ అనాలసిస్, సంతకం ధృవీకరణ వంటి అంశాల్లో పూర్తి సవివరమైన అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా అదనపు జిల్లా జడ్జి  ఎస్ సరిత, న్యాయమూర్తులు ఎం రాజేందర్, కె కిరణ్‌కుమార్,  కె కవిత,  కె సాయిశ్రీ, స్పెషల్ జ్యుడిషియల్ సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు తదితరులు హాజరయ్యారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పీ ఏ జిల్లా కన్వీనర్లు జే గోపికృష్ణ, సుంకర భానుప్రియ, సీనియర్ న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, జే శివరామ్ ప్రసాద్, విజయ్ భాస్కర్ రెడ్డి, పి నాగేశ్వరరావు, గంట వీరభద్రం, కిలారు పురుషోత్తం, గాజుల రామమూర్తి, బీ చిరంజీవి, నల్లమల ప్రతిభ, లక్ష్మీ సరిత, కాసాని రమేశ్, సహానజు పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అడపాల మహాలక్ష్మి, యెర్రా కామేష్, సాధిక్ పాషా, ఎర్రపాటి కృష్ణ, మారపాక రమేష్, అంబటి రమేష్, దొడ్డా సామంత్, మేకల దేవేందర్, పాల రాజశేఖర్, పగిడిపల్లి శ్రీకాంత్, వడ్లకొండ హరిప్రసాద్, ఇందిరా ప్రియదర్శిని, బేబీ షామిలి, దారావత్ రాధాకృష్ణ, యాస యుగేందర్ తదితర న్యాయవాదులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Tags:

About The Author

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి