మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..

 సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. 

మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..

లోకల్ గైడ్,నల్లగొండ జిల్లా బ్యూరో:

సూర్యాపేట తుంగతుర్తి కోదాడ ప్రాంతాలలో 60 సంవత్సరాల క్రితం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్యను అందించుటకు  సూర్యపేట మాజీ శాసనసభ్యులు ఎడ్ల గోపయ్య  ఎంతో సేవ తత్పరతతో హాస్టల్స్ స్థాపించి ఉచితంగా భోజనం, వసతి, విద్య కల్పించి ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప విద్యాదాత ఎడ్లగోపయ్య అని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనా రెడ్డి  అన్నారు.ఎడ్ల గోపయ్య సేవలు మరువలేమని, వారి సేవలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవకు తాను ముందుంటానని  వేనా రెడ్డి  అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాపోల్ల గుడి దగ్గర గల ఎడ్ల గోపయ్య విగ్రహం దగ్గర జరిగిన ఎడ్ల గోపయ్య వర్ధంతి కార్యక్రమం  మాల మహానాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొప్పుల వేనా రెడ్డి  ఎడ్ల గోపయ్య  వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ప్రభుత్వ న్యాయవాది తల్లమల్ల హసేన్, మాల మహానాడు సూర్యాపేట గౌరవ అధ్యక్షులు బోల్లెద్దు దశరథ, బోల్లెద్దు బుచ్చి రాములు, బోల్లెద్దు గోపయ్య న్యాయవాదులు ఏడిండ్ల అశోక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్, పిండిగ అశోక్, మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొయిల అఖిల్, ఎడ్ల గోపయ్య మనవడు ఎడ్ల గోపి, డిఆర్, పిడమర్తి శంకర్, వల్దాసు దేవేందర్, నామ వేణు, తదితరులు పాల్గొని ఎడ్ల గోపయ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి