రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*

IMG-20250819-WA0277కామారెడ్డి ,లోకల్ గైడ్ :

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యూరియా సరఫరా పగడ్బంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు . 
ఈ మేరకు మంగళవారం నిజాంసాగర్ మండలంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అచ్చంపేట్ పరిధిలో గల నర్సింగరావు పల్లి ఎరువుల గోదామును వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములో యూరియా స్టాక్ ను పరిశీలించారు. 71 యూరియా బస్తాలు  గోడౌన్లో  నిల్వ ఉన్నాయి.
 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రైతులకు యూరియా సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా  సక్రమంగా ఇచ్చేటట్టు చూడాలని, మన జిల్లాకు ప్రభుత్వం సరఫరా చేసిన చేసిన  యూరియా  మన జిల్లా రైతులకు మాత్రమే అందేటట్టు చూడాలని దానిలో భాగంగా జిల్లా చెక్పోస్టులలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు.
రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ను రైతులు ఉపయోగించేలా రైతులను చైతన్యవంతం చేయాలని  అన్నారు. నానో యూరియా రేటు తక్కువ ఉండటంతో పాటు  45 కిలోల యూరియా బస్తాకు సమానంగా  500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని నానో యూరియా రవాణాకు  అదనంగా రవాణా ఖర్చులు కూడా ఉండవు, డ్రోన్ ద్వారా సులభంగా పిచికారి చేయవచ్చు కాబట్టి  యూరియా బస్తాలకు బదులు నానో యూరియా ప్రమోట్ చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సంఘం వారు వారి యొక్క సొసైటీల ముందు ఎక్కువ జనం ఉండకుండా  ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటన చేస్తూ యూరియా మేనేజ్మెంట్ చేయాలని సూచించారు. రైతు యొక్క పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలని సూచించారు.  ప్రైవేట్ షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడా సబ్సిడీ యూరియా  పక్కదోవ పట్టకుండా అనగా ఇండస్ట్రీస్ కు, గాని ప్లైవుడ్ ఇండస్ట్రీస్ గాని పెయింట్ ఇండస్ట్రీస్ గాని వెళ్లకుండా అధికారులు పరిశ్రమలను సర్ప్రైజ్ విజిట్స్ చేయమని సూచించారు. 
      జిల్లా కలెక్టర్ వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి , జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్, సహకార సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్ 
ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...
గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*
అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు