భైంసా సబ్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్న నిర్మల్ పోలీసులు

బాసర గోదావరి నది ఘాట్ల వద్ద పోలీసుల నిరంతర గస్తీ

భైంసా సబ్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్న నిర్మల్ పోలీసులు

నీటి నిల్వలో చిక్కుకున్న ప్రజలను వేగంగా స్పందించి రక్షణ కల్పిస్తున్న పోలీసులు. 24 గంటలు పోలీసు అధికారులు సిబ్బంది, ప్రజల భద్రత కొరకు క్షేత్రస్థాయిలో పని చేయాలి

నిర్మల్ : లోకల్ గైడ్ :  
బైంసా సబ్ డివిజన్ పరిధిలోని బాసర నీట మునిగిన పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల స్వయంగా పరిశీలించారు.IMG-20250829-WA0091
ముఖ్యంగా బాసరలో గోదావరి నది తీరాన ఉన్న మూడు లాడ్జిల్లో ఇరుక్కున్న కుటుంబాలను, భక్తులను  శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా ట్రాక్టర్ పై వెళ్లి పరామర్శించారు. వరదల వల్ల ఇండ్లలో ఇరుక్కున్న కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తక్షణ సహాయంగా ఆహారం, మంచినీటిని అందించాలని ఆదేశించారు. గోదావరి నది వద్ద గంగా పుత్రులు గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సమయంలో సహాయం అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

 
భారీ వర్షాల కారణంగా భైంసా సబ్ డివిజన్ ప్రాంతాలైన బాసర, తానూర్, భైంసా గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.ఎక్కడెక్కడ అయితే వర్షపు నీరు రోడ్ల మీదకు వచ్చిందో అక్కడ అంతా పోలీసులు ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యంగా బాసర లోని పలు ప్రాంతాల్లో వర్షపు నీటిలో చిక్కుకున్న వృద్ధులు, మహిళలు, చిన్నారులను సురక్షిత ప్రదేశాలకు తరలించి వారి ప్రాణాలను రక్షించారు. రోడ్లపై నిలిచిన నీటిలో వాహనదారులు సురక్షితంగా వెళ్లేలా మార్గనిర్దేశం చేశారు.
అంతేకాక బాసర గోదావరి నది ఘాట్ల వద్ద వరద ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. ఘాట్ వద్దకు వచ్చే ప్రజలను అప్రమత్తం చేస్తూ, భద్రత కోసం అవసరమైన సూచనలు అందిస్తున్నారు.
వాహనదారులు – పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో నిర్మల్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.అదే సమయంలో ట్రాఫిక్ స్తంభించకుండా అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మాట్లాడుతూ ఆదేశాల మేరకు పోలీసులు 24 గంటలు క్షేత్రస్థాయిలో ప్రజలతోనే ఉంటూ, “ప్రజల భద్రతే లక్ష్యంగా సహాయక చర్యలు చేపట్టాలనిఋ కోరారు.ఈ పర్యవేక్షణలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్, ముధోల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి