యూరియా కోసం రైతులు బారులు 

యూరియా కోసం రైతులు బారులు 

 

(లోకల్ గైడ్) మహబూబాబాద్; కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ లో పిఎసిఎస్ వద్ద పెద్దఎత్తున రైతులు రాత్రి నుండి క్యూ లో నిల్చొని యూరియా కోసం ఉన్నారు,మండల పరిధిలో చుట్టు పక్కల ఉన్న తండాలో రైతులు యూరియా కోసం పడిగాపులు గత వారం రోజుల దగ్గర నుండి వస్తూ పోతూ ఉన్న తమకు కావలసిన యూరియా బస్తాలు మాత్రం రావట్లేదు ఇలానే కొనసాగితే వేసిన తమ పొలాలతో పాటు మక్కలు , పత్తి పంటలు పండే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ఈరోజు యూరియా బస్తాలు వస్తాయని సమాచారం తో పెద్ద సంఖ్యలో రైతులు ,మహిళలు లైన్ లో రాత్రి నుండి అక్కడే వేచి చూస్తునారు , నాట్లు వేసినపట్టినుండి తమ పొలాలకి యూరియా వేయలేదని మళ్ళీ ఇపుడు యూరియా వేయకుంటే పొలాలు పండే పరిస్థితి లేదని వ్యవసాయ అధికారులు యూరియా బస్తాలు సరిపడ అందించాలని కోరారు , ఇలా ఒకవైపు రైతులు ,మహిళలు  బస్తాల టోకెన్ ల కోసం లైన్లో ఉండగా వ్యవసాయ అధికారులు మరియు పోలీసులు రైతులకు టోకెన్ ల కోసం ఉన్న రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సమన్వయం చేస్తూ ఎపటికపుడు రాత్రి దగ్గరనుండి పలు సూచనలు చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News