దేవంపల్లి గురుకులానికి సోలార్ ను మంజూరు చేయాలి
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
గురుకులాల విద్యార్థులు హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర మొగురం రమేష్
కరీంనగర్: లోకల్ గైడ్:
ప్రభుత్వ భవనాలపై, స్కూల్లు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల భవనాలపై ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ద్వారా సోలార్ సిస్టమును పెడతా మని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సెక్రటేరియట్ లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి స్వాగతిస్తున్నామని తెలంగాణ గురుకులాల విద్యార్థుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్, డెమోక్రటిక్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకుల తరఫున స్వాగతిస్తున్నామన్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో సైతం సొంత భవనాలు ఉన్న గురుకులాల భవనాలపై వెంటనే సోలార్ సిస్టం ఏర్పాటు చేసి సౌర విద్యుత్ అందె
విధంగా కృషి చేయాలని అన్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని
దేవంపల్లి ఎస్సి గురుకులానికి నూతన సోలార్ ను కేటాయించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ను కోరారు.
గత సంవత్సరమే ప్రజావాణిలో సోలార్ కోసం వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సోలార్ రిపేర్ ఉన్నందున ప్రభుత్వం ఇప్పుడు సోలార్ సౌర విద్యుత్ పై నిర్ణయం తీసుకోవడంతో మా దేవంపల్లి ఎస్సి గురుకులానికి సోలార్ సిస్టమ్ కేటాయించాలని గురుకులాల తల్లిదండ్రుల తరఫున, డెమోక్రటిక్ పేరెంట్స్ తరఫున ప్రభుత్వమును, జిల్లా కలెక్టర్ ను ఈ సందర్భంగా కోరుచున్నామన్నారు
About The Author
Related Posts
