ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రిజిస్టర్లో సక్రమంగా నిర్వహించాలి .

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రిజిస్టర్లో సక్రమంగా నిర్వహించాలి .

              నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో అన్ని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా ,తిప్పర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి రిజిస్టర్, ఏఎన్ సీ,ఈడిడి రిజిస్టర్ లను పరిశీలించారు. అంతేకాక ఆసుపత్రిలో ప్రదర్శించిన  ఈ డి డి బోర్డును పరిశీలిస్తూ ఈడిడి బోర్డు,రిజిస్టర్ లో అందరు గర్భిణీ స్త్రీల ప్రసవ తేదీలు,వారి పూర్తి వివరాలు లేకపోవడంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్టర్లలో పూర్తి వివరాలు అన్నింటిని నమోదు చేయాలని ,ఈ వివరాల వల్ల భవిష్యత్తులో   సక్రమ చికిత్స కు ఉపయోగపడుతుందని తెలిపారు.

           అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ  బాలిక విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారి విద్యా సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు .గతంలో తాను పాఠశాలను సందర్శించినపరికి ఇప్పటికీ పాఠశాల విద్యార్థులు చదువులో ఎంతో మెరుగ్గా ఉన్నారని, ఇలాగే చదువుకోవాలని, బాగా చదివి ఉన్నత స్థానంలో  ఉండాలని అన్నారు.

       జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, తహసిల్దార్ రామకృష్ణ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, తదితరులు  ఉన్నారు.

Tags:

About The Author

Latest News