వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి
రాబోయే రోజుల్లో 60 వేల ఎకరాలకు సాగు నీరు – భట్టి విక్రమార్కను ‘అపర భగీరథుడు’గా కొనియాడిన మంత్రి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వంగవీడు గ్రామంలో 630 కోట్ల అంచనా వ్యయంతో జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతులకు 60 వేల ఎకరాల సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు రైతు సంక్షేమానికి దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. భట్టి విక్రమార్కను ‘అపర భగీరథుడు’గా పొగిడిన ఆయన, బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం వంగవీడు గ్రామంలో 630 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
కార్యక్రమంలో పాల్గొన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,పలువురు ఎమ్మెల్యేలు,నాయకులు,జిల్లా అధికారులు.
*మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్:*
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం
రైతులందరికీ నా శుభాకాంక్షలు..ఈ ప్రాజెక్ట్ ద్వారా రానున్న రోజుల్లో సుమారు 60వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది.
భట్టి విక్రమార్క గారు అపర భగీరథుని లా పనిచేస్తున్నారు..నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు..ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
అందరు అమ్ముడు పోయిన భట్టి విక్రమార్క గారు ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ ప్రభుత్వం పై పోరాడారు..
ఇక్కడున్న ప్రజలను అడుగుతున్న కేసిఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూం వచ్చిందా..?
రేషన్ కార్డు వచ్చిందా..? సన్న బియ్యం వచ్చినయా?
మరి ఏమీ ఇయ్యనీ,ప్రజలకు ఏమీ చేయని బిఆర్ఎస్ పార్టీ మనకు అవసరమా..?
కేసిఆర్ కుటుంబం కన్నుపడి SLBC సొరంగం కూలింది..దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం..త్వరలోనే పూర్తి చేస్తాం..
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకుంటున్నాం..బ్రాహ్మణ వెళ్ళేంల,దిండి,పాలమూరు ఎత్తిపోతల,దేవాదుల సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోబోతున్నాం.
వాళ్ళు కమిషన్ కోసమే ప్రాజెక్టులు కట్టారు..
ఇందిరమ్మ ఇళ్లు కోసం ఒక్కో ఇంటికి 5లక్షలు ఇస్తున్నాం..రేషన్ కార్డులు, పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం.. అన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నాం..
నాడు ధరణి పేరు మీద భూములను లూటీ చేశారు..నేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా పేదలకు,రైతులకు ఇబ్బందులు లేకుండా భూ భారతి తెచ్చాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో త్వరలోనే హ్యామ్ విధానంలో 12వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు వేసుకోబోతున్నాం..ఈ వంగవీడుకు కూడా డబుల్ రోడ్ రాబోతుంది.
ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరుతున్న..
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా నిలవాలి..ప్రజల్ని పట్టించుకోని బిఆర్ఎస్ లాంటి పార్టీలు మనకు అక్కర్లేదు..
About The Author
