విద్యా రంగ సమస్యలపై డి వై ఎస్ ఎఫ్ పోరాడుతుంది .
నార్కట్ పల్లి మండల కేంద్రంలో డి,వై,ఎస్ ,ఎఫ్,. జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
నార్కెట్ పల్లి .లోకల్ గైడ్ : విద్యా రంగ సమస్యలపై దళిత యువజన విద్యార్థి సమాఖ్య అలుపెరుగని పోరాటం చేస్తుందని నల్లగొండ జిల్లా అధ్యక్షులు పుల్లెంల సందీప్ కుమార్ వెల్లడించారు.
నార్కట్ పల్లి మండల కేంద్రంలో డి,వై,ఎస్ ,ఎఫ్,. జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు . ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పుల్లెంల సందీప్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై దళిత యువజన విద్యార్థి సమాఖ్య అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు .పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల 200 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ లను కాపాడాలని అన్నారు. చట్టం కేంద్ర ప్రభుత్వం 2010లో అమల్లోకి తీసుకొచ్చిందో వెంటనే ఆ చట్టాన్ని అమలు చేయాలని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ వేసి ఆ కమిటీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తీసుకోవడం జరిగింది ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను పర్యాయన్లోకి తీసుకుని వెంటనే విద్యార్థి చట్టాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.గురుకులాల్లో సరైన వసతులు లేక వార్డులు సరిగా పట్టించుకోక ఈ సంవత్సరం 97 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇట్టి సమస్యల మీద స్పందించి పరిష్కారం కోసం చొరవ చూపాలని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోడ అవినాష్, శ్రీరామ్, వాడ శివ, వెంకన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
About The Author
