కేటీఆర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి
విలేకర్ల గోష్టిలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాదు ,లోకల్ గైడ్ :
ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ కు సంబంధం లేకున్నా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనవసర ఆరోపణలు కేటీఆర్ పై చేస్తున్నారని మాజీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు . కేటీఆర్ కూడా చాలా సార్లు చెప్పారు ,ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేని అంశం అధికారులకు సంబంధించింది అని అయిన బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని నిజామాబాదు బిఆర్ ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల గోష్టిలో మాట్లాడుతూ అన్నారు .ఒక కేంద్ర మంత్రి స్థాయి హోదాలో ఉండి బజారు బాషా మాట్లాడుతున్నాడని విమర్శించారు . ఇలాగే మాట్లాడితే తెలంగాణ ప్రజలు, బిఆర్ ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు .
మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయం అంటే ఎత్తిపోయిన బోరు బావులు,చాలీ చాలని కరెంట్ తో రైతులు గోస పడేవారు.దిక్కుతోచని స్థితిలో మొగులుకి మొఖం పెట్టి మా బీడు భూములు తడపడానికి ఒక చినుకు పడకపోతుంద అని రైతులు ఎదురు చూసేవారు. వ్యవసాయం దండగలా ఉండేది . ఇప్పుడు
గడిచిన గత 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ తో చెరువులు బాగు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టి, చెరువులు నింపి,వాగులు వంకల్లో చెక్ డ్యామ్ లు కట్టి నీటిని ఆపి ఎత్తిపోయిన బోర్లలో నీటి ధార వచ్చేట్టు చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు . కడుపు నిండా కరెంటుతో ,రైతు భీమాతో ,ఊరూరా కొనుగోలు కేంద్రాలలో వ్యవసాయం పండగల మారిందని అన్నారు .
కాళేశ్వరం తో ఆంధ్రా ప్రాంతం లోనే కాదు మాకు కూడా చివరి ఆయకట్టుకు కాలువల ద్వారా సాగు నీరు వస్తది , మేము కూడా దర్జాగా రెండు లేదా వీలైతే మూడు పంటలు కూడా పండించుకోవచ్చు అని తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా కలిగింది అంటే కారణం ఒకే ఒక్కడు అది కేసీఆర్ అని అన్నారు .
*తన సంకల్ప దీక్షతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సాగు బతుకు మార్చిన అపర భగీరథుడు పెద్ద రైతు కేసీఆర్.*
తెలంగాణ దేశం లోనే సాగులో ఆకాశమంత సంపద సృష్టించిన కేసీఆర్ కు కాంగ్రెస్ బురద అంటించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు . తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పడ్డ తాపత్రయం తండ్లాట అర్ధం కానివారే తప్పుడు కూతలు కూస్తారని అన్నారు .
ఉమ్మడి రాష్ట్రం లో అనుభవాలను గమనించి దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా పోవడం చూసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో సాగునీటి రంగాన్ని శీఘ్ర గతిన పనులయ్యే రంగం గా మార్చారని అన్నారు . ఎంత త్వరగా అయితే అంత తొందరగా తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలే అనే తాపత్రయంతో కేవలం మూడు సంవత్సరాల కాలంలో కాళేశ్వరం నిర్మించారు తప్ప ఇంకోటి కాదు, అందులో ఏ తప్పు జరుగలేని అన్నారు . చీమంత సమస్య కూడా జరగని కాళేశ్వరం ప్రాజెక్టులో కొండంత సమస్యగా జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు .
మెడిగడ్డను పండబెట్టి గోదావరి నీళ్లను ఆపకుండా నేరుగా క్రిందకు పోనిచ్చి (ఆంధ్రాకు) బనక చర్ల కు గోదావరి నీళ్లను దోచిపెట్టి చంద్రబాబు కు గురుదక్షిణగా ఇవ్వడం కోసమే కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి సర్కార్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు . దీంతోపాటు అసెంబ్లీ ఎన్నికల అప్పుడు కాళేశ్వరం కొట్టుకుపోయింది అని దుష్ప్రచారం చేసి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నాని మాజీ మంత్రి పేర్కొన్నారు . ఆ దుష్ప్రచారంలో భాగమే ఈ ఘోష్ కమిషన్ నివేదిక అంటూ లీకులు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెర లేపిందని అన్నారు . కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బరాజ్ ఒక్కటే కాదు, అందులో 3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు,
203 కిలోమీటర్ల సొరంగాలు,1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్,98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్
141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్,240 టిఎంసీల ఉపయోగం వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వెల్లడించారు .
ఇన్ని ఉంటే అందులో ఒకే ఒక బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే దానిని బాగు చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అని అవినీతి అని నానా రాద్దాంతం చేస్తున్నదని అన్నారు . మెడిగడ్డ బ్యారేజ్ మొన్నటికీ మొన్న 5 లక్షల క్యూసెక్స్ వరదకు కూడా గట్టిగా తట్టుకొని నిటారుగా నిలబడ్డది రా చూసొద్దాం అన్నారు .
కాళేశ్వరం ప్రాజెక్టు తో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని పనికి మాలిన మాటలు
మాట్లాడుతున్నారు . ప్రజా ధనం కాళేశ్వరం ప్రాజెక్టు తో వృధా కాలేదు . రెండు పిల్లర్లకు సమస్యలు వస్తే రిపేర్ చేయించలేని కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తనం వల్లే ప్రజా ధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు . కళ్ళ ముందు గోదావరి నదిలో లక్షల క్యూసెక్కులు నీళ్లు కిందకు పోతున్నా వాడుకోకుండా గుడ్లప్పగించి చూస్తున్న ఈ కుటిల బుద్ది కాంగ్రెస్ సర్కార్ వల్లే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని విమర్శించారు . కాళేశ్వరం పై ఇచ్చిన ఘోస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ రేవంత్ రెడ్డి,చంద్రబాబు,బిజెపి కలిపి వండిన ఘోస్ట్ కమిషన్ రిపోర్ట్ అని అన్నారు . ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అది కోర్టులో చెల్లదని పేర్కొన్నారు . రిపోర్ట్ షీల్డ్ కవర్ లో ఉండగానే దాంట్లో ఏముందో పిసిసి అధ్యక్షుడు చెప్తాడు. రేవంత్ రెడ్డి,చంద్రబాబు కి డబ్బా కొట్టే కొన్ని పత్రికలు దాంట్లో ఏముందో బ్యానర్ ఐటమ్ లో ముందే రాస్తాయి .
దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ?
దీన్ని పిసిసి రాసిచ్చిన రిపోర్ట్ అనుకోవాలా? అని ప్రశ్నించారు .
గత రెండు ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే కమిషన్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అందుకే ఇది ఘోస్ కమిషన్ విచారణ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ , రేవంత్ రెడ్డి మౌత్ టాక్ కమిషన్ రిపోర్ట్ అని హెద్దేవా చేశారు .
మొత్తం 665 పేజీలు ఘోస్ కమిషన్ నివేదికలో కేవలం 60 పేజీలతో అందులో కూడా వారికి అనుకూలమైన పేరాలతో బయటపెట్టి కేసీఆర్ పై కుట్రలు చేయాలని చూస్తోంది.అందుకే ఇది పొలిటికల్ కమిషన్ రిపోర్ట్ గా భావించాల్సి వస్తోందని పేర్కొన్నారు .
ఘోస్ కమీషన్ నివేదిక లో పదే పదే తమ్మిడీ హట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టకుండా మెడిగడ్డ కు ఎందుకు మార్చారు అని అన్నారు.
అసలు తమ్మిడీ హట్టి దగ్గర కావాల్సినంత నీటి లభ్యత లేదు అని సి డబ్ల్యు సి చెప్పింది. 2007 లో వారు మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు వచ్చాయా ? రాకపోతే ఎందుకు రాలేదు ?
ఒకవేళ అన్ని అనుమతులు ఉండి ఉంటే 2007 నుండి 2014 వరకు 7 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ,మహారాష్ట్ర లో మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా ? అని ప్రశ్నించారు . మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ 7 సంవత్సరాల కాలంలో తమ్మిడీ హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ ఎందుకు కట్టలేకపోయిందని అన్నారు . కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా ? అందుకె గోదావరి లో ప్రాణహిత కలిసే చోట నీళ్లు పుష్కలంగా ఉంటాయి అని WAPCOS డబ్ల్యు ఎ పి సి వో ఎస్ సూచనల ప్రకారం మెడిగడ్డ దగ్గర బ్యారేజి కట్టామని అన్నారు .
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ అనుమతులు లేవు అన్నారు . వివిధ సందర్భాల్లో 5 సార్లు క్యాబినెట్ లో చర్చించి ఆమోదం పొందింది అని హరీష్ రావు ఆధారాలతో సహా గతంలో చూయించారు. కాగా ఎన్నికలు అయిన మరుసటి రోజు నుండే ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి డెబ్భై వేల కోట్లతో, లక్ష కోట్లతో, లక్షా యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ చేద్దాం అని ప్రకటించారు.వాటికి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా ? అని ప్రశ్నించారు . కొండంగల్ లిఫ్ట్ కి జి.ఓ ఇచ్చాక క్యాబినెట్ రాటిఫికేషన్ చేశారని గుర్తు చేశారు .
ఫ్యూచర్ సిటీ అని సంవత్సరం నుండి చెప్తూ దానికోసం 1600 కోట్లతో రోడ్ కు టెండర్ పిలిచారు. ఫ్యూచర్ సిటీ కి క్యాబినెట్ అప్రోవల్ ఉందా? ఉంటే ఎప్పుడు చేశారు !
మీకోక నీతి కేసీఆర్ కి ఒక నీతా ? అని అన్నారు .
విచారణ కమిషన్ వాస్తవాల ఆధారంగా కాకుండా కాంగ్రెస్ ,బిజెపి నేతల ఆరోపణలు మరియు చంద్రబాబు నాయుడు బాజా పత్రికల రాతల ప్రభవానికి లోనై నివేధిక ఇచ్చింది అనేది స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు .
న్యాయ నిపులను సంప్రదించి, ప్రముఖ సౌత్ ఇండియా డిజిటల్ మీడియా సంస్థ “సౌత్ ఫస్ట్” ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం
కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కోర్టులలో చెల్లదని అన్నారు . కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం, సెక్షన్ 8B కింద రిపోర్ట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున కేసీఆర్ ని , హరిష్ రావు ని వివరణ కోరలేదు కాబట్టి, అది సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధమని పేర్కొన్నారు .
గతంలో అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇదే ఉచ్చరించిందని అన్నారు .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టిన కమిషన్ రిపోర్టును కూడా ఎన్ డి ఎస్ ఏ రాలేదు ,
కాంగ్రెస్ బిజిపి కలిపి కేసీఆర్ మీద కక్ష్య కట్టిండ్రు అని అన్నారు .
కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ లో ఒక్క మెడిగడ్డ బరాజ్ లో రెండు పిల్లర్లు కుంగితే ఎన్ డి ఎస్ ఏ ఆగమేఘాల మీద వచ్చి రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు . ఏ పి లో పోలవరం రెండు సార్లు కొట్టుకుపోతే ఎన్ డి ఎస్ ఏ ఎందుకు రాలేదు ? అని ప్రశ్నించారు .
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రాజెక్ట్ లు కూలినాయి , సుంకిషాల గోడ,ఎస్ ఎల్ బి సి టన్నెల్ కూలిపోయినాయి , మరి వాటి మీద ఎందుకు ఇప్పటికి ఎన్ డి ఎస్ ఏ రాలేదు ? ఇది కాంగ్రెస్ BJP మిలాఖత్ కి ఉదాహరణ
కాదా ?అని అన్నారు .
కాళేశ్వరం లో చిన్న నష్టం జరిగితే కేసీఆర్ , హరీష్ రావు లదే బాధ్యత అంది కమిషన్ రిపోర్ట్.
మరి పెద్దవాగు కు గండి పడినా, సుంకిషాల కూలినా,ఎస్ ఎల్ బి సి టన్నెల్ మొత్తం కూలి ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయినా చనిపోయిన వారి ఆచూకీ ఇప్పటికీ దొరక్కపోయినా..ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ ల పై కమిషన్ వేసి వించారణ ఎందుకు చేయటం లేదు ? అని అన్నారు .
రేవంత్ రెడ్డి ని, ఉత్తమ్ ను ఎందుకు బాధ్యులను చేయరు ? పోలవరం డయాఫ్రమ్ వాల్ 2 సార్లు కొట్టుకుపోతే కట్టిస్తున్న చంద్రబాబు,డబ్బులిస్తున్న ప్రధాని పై కమిషన్ వేసి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ? అని అన్నారు .
ఒక్క కేసీఆర్ పైనే కమీషన్ లు ఎందుకు వేస్తున్నారు ? అంటే కాంగ్రెస్ ,బిజెపి,చంద్రబాబు అందరి టార్గెట్ కేసీఆర్. కాగా రేవంత్ ఢిల్లీ 51 సార్లు పోయారు .విదేశాలకు మూడు నాలుగు సార్లు వెళ్లారు .
21 నెలల పాలనలో మూడు నెలల పైనే బయటే గడిపారు .
సీఎం కు ట్రిప్పుల మీద ఉన్న మోజు రైతుల తిప్పలు తీర్చడం లో లేదు ,
హామీలు ఏమయ్యాయని అడిగితే కుట్రలు కుతంత్రాలకు తెర లేపుతున్నారని అన్నారు .
కమీషన్ ల పేరిట, ఎంక్వైరీ ల పేరిట, అరెస్టుల పేరిట అడిగే వారిని బయపెట్టాలని చూస్తున్నారు.ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారు.
కుంటిసాకులతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప రైతుల కడుపు నింపే పనులు చేయడం లేదు అన్నారు .
రుణ మాఫీ నుంచి రైతు భరోసా దాకా రేవంత్ ది అంత మోసమే
చారాణా పని కూడా చేయలేదు బారాణా ప్రచారం చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు . రాష్ట్రం లో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తోంది .
మాఫీలు అమలు కాలేదు . కానీ హామీల మాఫీ అమలవుతోంది .
రైతు ప్రభుత్వం పోయి రద్దుల ప్రభుత్వం ,రాక్షస ప్రభుత్వం వచ్చింది.
ఎన్నికలప్పుడు ఎన్నో చెప్పారు . పాలనలో అన్నీ తప్పారు .
ఎన్నికలప్పుడు గాలి మాటలు , గద్దెనెక్కినాక కూడా గాలి మాటలే .
ఇపుడు గాలి మాటలకు తోడు గాలి మోటార్లల్ల తిరుగుడు , ఇంతకు మించి ఏం జరగలేదని అన్నారు .
మార్పు తెస్తామంటే ఏమో అనుకున్నారు , తెలంగాణ ఏర్పడకముందు ఉన్న పరిస్థితి తెచ్చాడు మళ్ళీ పాత రోజులు వచ్చాయని అన్నారు .
ఎరువుల కోసం రైతులు చెప్పులు క్యూలో మళ్ళీ వచ్చినయి.
కరెంటు సరిగా లేక ,ఇచ్చే ఆ అరకోర కరెంటు కూడా లోవోల్టేజ్ లతో న్మోటార్లు కాలుతున్నాయ్ ,
కాలిన మోటార్లతో రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి . నీళ్లిచ్చే అవకాశమున్నా నీళ్లు ఇవ్వక పంటలను ఎండబెడుతున్నాడు . ప్రభుత్వాలు మారాక మాజీ సీఎం ల మీద ,మాజీ మంత్రుల మీద విచారణ కొత్తకాదు .
వై ఎస్ ,చంద్రబాబు ల మీద కూడా కమిషన్ల విచారణ జరిగింది . వై ఎస్ ,చంద్రబాబు, ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీల మీద కూడా కమిషన్లు వేశారు . వారు ఏ విధంగా కమిషన్ల పై న్యాయస్థానాల్లో తేల్చుకున్నారో కేసీఆర్ కూడా అలాగే తేల్చుకుంటారని అన్నారు .
రిటైర్డ్ జడ్జి ఘోష్ విచారణ జరిగిన 16 నెలల కాలం లోనూ కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం పై విమర్శలు ఆరోపణలు మానలేదు . ఘోష్ విచారణ అయిపొయింది కదా ! ఇపుడైనా మేడి గడ్డ బ్యారేజ్ ను వాడుకోండి . కన్నె పల్లి మోటార్లు ఆన్ చేయండి . రైతులకు నీరు ఇవ్వండి అని సూచించారు . కేసీఆర్ మీద కక్ష తో రైతుల పాలిట కల్ప వృక్షంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కూకటి వేళ్ళతో పెకిలించడాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకుంది . విచారణలు ఎన్నైనా చేసుకోవచ్చు .మీ కడుపు లో ఉన్న విషం బయటకు వచ్చే దాకా ఏమైనా మాట్లాడుకోండి .తెలంగాణ పొట్ట మాత్రం కొట్టొద్దు అని రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు . ఈ విలేకర్ల సమావేశంలో నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , జెడ్ పి మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు , బిఆర్ ఎస్ నాయకులు బాజిరెడ్డి జగన్ ,సుర్జీత్ సింగ్ ఠాకూర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు .
About The Author
