84 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
By Ram Reddy
On
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
సోమవారము సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ భూ సమస్య లు,ఇందిరమ్మ ఇల్లు ఎలక్ట్రిసిటీ,గ్రామ పంచాయతి ,విద్యా శాఖ, ఆసరా పెన్షన్లకు సంబందించి ఫిర్యాదులు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.
సి ఎం ఓ ప్రజావాణి కి జిల్లా పై వచ్చిన ప్రజా ఫిర్యాదు లను చెక్ చేసి దరఖాస్తు ఎ ప్రాసెస్ లో ఉందొ చెక్ చేసి ఆన్లైన్ అప్డేట్ చేయాలనీ ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.
కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది అందరు సమయ పాలన పాటిస్తూ అటెండన్స్ తప్పనిసరిగా ఉండాలని, మిగతా అందరు అధికారులు కూడా అటెండన్స్ రిజిస్ట్రేషన్ చేయించు కోవాలని ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవానికి అధికారులు సమన్వయ ముతో ఘనంగా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి ,ఆర్ డి ఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు,ఎ ఓ,సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 16:17:40
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా : జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పునస్కరించుకొని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎస్వీ ప్రభుత్వ జూనియర్...