బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు పార్లమెంట్ లో చట్టం చేయాలి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా. లోకల్ గైడ్ : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం డిమాండ్ చేశారు.సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాశం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కులగలన చేపట్టి 56% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు. పార్లమెంటులో ఆమోదింపజేసి చట్టం చేయడానికి బిజెపి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు మైనార్టీలకు రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారని కుంటి సాగుతూ ఆపడం సరికాదని అన్నారు. ముస్లింలలో దూదేకుల ఫకీరు రాయి కొట్టే కాశవారు అనేక సంవత్సరాలు నుండి బీసీలుగా ఉన్నారని అన్నారు. వారిని బుచిగా చూపించి బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులను నిలదీయాలని పర్యటన సందర్భంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు .బిజెపి తమ ద్వంద వైఖరి మానుకొని ఇప్పటికైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏకపక్షంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో వెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ దండెంపల్లి సరోజ అవుట రవీందర్, నాగరాజు విష్ణుమూర్తి లక్ష్మణ్ లక్ష్మీపతి దూదిమెట్ల వెంకన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు
About The Author
Related Posts
