ప్రభుత్వం విద్యారంగానికి  ఏటా ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తుంది...

ప్రభుత్వం విద్యారంగానికి  ఏటా ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తుంది...

 కళాశాల అధ్యాపక బృందం జీతం కోసం కాకుండా విద్యార్థుల జీవితాల కోసం కృషి చెయ్యాలి...

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్ వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం... 
నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రతినిధి : : (లోకల్ గైడ్) 
కోటగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ పాఠశాలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్ వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు.ముందుగా జూనియర్ కళాశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరు పోసారు.కళాశాల విద్యార్థులు పూలవర్షంతో పోచారం శ్రీనివాసరెడ్డి ని కళాశాలకు ఆహ్వానం పలికారు.ముందుగా కళాశాల అవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ విద్యార్థుల గైరాజరు ఉత్తీర్ణతపై ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు.విద్యాబోధనపై ప్రతేక దృష్టి సారించాలని లేదంటే కళాశాల కోటగిరి నుండి మరోచోటికి బదిలీ తప్పదన్నారు.స్వయంగా తన మొబైల్ ద్వారా విద్య ప్రముఖ్యతపై ఓ సందేశాన్ని విద్యార్థులకు వినిపించి చైతన్య పరిచారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ లొనే జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. బాన్స్ వాడ నియోజకవర్గంలో ఏర్పాటైన డిగ్రీ వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాల గురించి తెలియచేశారు.జూనియర్ కళాశాలలో టాయిలెట్ల నిర్మాణనికి 30 లక్షల నిధులు మంజూరు అయ్యాయని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు.విద్యార్థుల ఉత్తీర్ణత శాతం హాజరు శాతం పరిశీలించారు.కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  విద్యార్థుల గైర్హాజరుపై పోచారం శ్రీనివాసరెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు..కళాశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందాని లెక్చరర్లపై అసహనం వ్యక్తం చేశారు..
విద్యార్థులకు అర్థమయ్యేలా చదువు చెప్పకపోతే లెక్చరర్లను  బదిలీ చేయిస్తానని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డి ఐ ఈ ఓ..రవికుమార్,ఏం ఈ. ఓ.శ్రీనివాసరావు,ప్రిన్సిపాల్ కైసర్ పాషా, ఎఎంసి.చైర్మన్. హన్మంత్,మాజీ జడ్పీటీసీలు. శంకర్ పటేల్,పుప్పాల శంకర్,విండో చైర్మన్.కూచి సిద్దు,మాజీ సర్పంచ్. పత్తి లక్ష్మణ్,మాజీ ఎఎంసి చైర్మన్లు.,హమీద్,నిరాడి గంగాధర్,నాయకులు.మనోహర్, ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News